Share News

Caste Census: కులగణనకు అన్ని పార్టీలు సహకరించాలి

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:00 AM

రాష్ట్రంలో జరగబోయే కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి బీసీ కులాల లెక్కలు తేలడానికి తమ వంతుగా అండగా నిలబడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వివిధ రాజకీయ పార్టీలను కోరారు.

Caste Census: కులగణనకు అన్ని పార్టీలు సహకరించాలి

  • కిషన్‌ రెడ్డి, కోదండరాం, కూనంనేనిలతో జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో జరగబోయే కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి బీసీ కులాల లెక్కలు తేలడానికి తమ వంతుగా అండగా నిలబడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వివిధ రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి. కిషన్‌ రెడ్డి, టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనమండలి సభ్యు లు, ప్రొఫెసర్‌ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులతో జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలోని బీసీ ప్రతినిధుల బృందం భేటీ జరిగింది.


ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ సమగ్ర కులగణన అంశంపై ఈ నెల 20న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావాలని ఈ సందర్భంగా జాజుల వారికి విజ్ఞప్తి చేశారు. సమగ్ర కులగణనకు రాష్ట్రంలో తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఈ కులగణన ఉపయోగపడేలా తాము సంపూర్ణంగా సహకరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అఖిలపక్ష పార్టీల సమావేశానికి తాము సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా ఆ సమావేశానికి హాజరు అవుతున్నట్లు ప్రొఫెసర్‌ కోదండరాం, కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Updated Date - Oct 19 , 2024 | 05:00 AM