Alert: పెండింగ్ చలాన్స్ చెల్లిస్తున్నారా జాగ్రత్త..ఈ పొరపాటు అస్సలు చేయకండి!
ABN , Publish Date - Jan 02 , 2024 | 01:32 PM
సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేటుగాళ్లు ఇప్పటికే అయోధ్య రామమందిరం విరాళాల క్యూర్ కోడ్ నకిలీది తయారు చేయగా..తాజాగా తెలంగాణలో పెండింగ్ చలాన్స్ ఫేక్ వెబ్‌సైట్ రూపొందించారు.
రోజురోజుకు సైబర్ నేరాలు(cyber crime) పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. దుండగులు అనేక వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు ప్రధానంగా డోనేషన్ లేదా చెల్లింపుల వెబ్‌సైట్లపై ఈ నేరగాళ్లు దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటివల అయోధ్య రామ మందిరం విరాళాల క్యూర్ స్కాన్ కోడ్ సైతం నకిలీది తయారు చేసి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిపై అప్రమత్తమైన ఆయా సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ(Telangana)లో పెండింగ్ చలాన్స్(pending challans) చెల్లింపుల విషయంలో అధికారులు ఆఫర్ ప్రకటించగా..కేటుగాళ్లు దీనిపై కూడా ఫోకస్ చేశారు. ఈ క్రమంలో దుండగులు www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఈ ఫేక్ వెబ్‌సైట్‌లో పొరపాటున కూడా పేమెంట్స్ చేయోద్దని సూచించారు. అంతేకాదు అసలు వెబ్‌సైట్ www.echallan.tspolice.gov.in/publicview దీనిలో మాత్రమే పేమెంట్స్ చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో వాహనదారులు పేమెంట్స్(payments) చేసే విషయంలో తొందర వద్దని పోలీసులు అన్నారు. ఒకటికి రెండు సార్లు అధికారిక వెబ్‌సైట్ పేరు పరిశీలన చేసుకుని చెల్లింపులు చేయాలని కోరారు. అంతేకాదు పేటీఎం, మీ సేవా కేంద్రాల్లో కూడా పెండింగ్ చలాన్స్ చెల్లింపులు చేయవచ్చని చెప్పారు. ఈ క్రమంలో అసలు నకిలీ వెబ్‌సైట్ ఎవరు క్రియేట్ చేశారు? వెబ్ క్రియేట్ చేసిన వారు ఇక్కడి వాళ్లేనా లేదా అని సైబర్ క్రైమ్ పోలీసులు పలు రకాల వివరాలను ఆరా తీస్తున్నారు.