Sriramanavami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..
ABN , Publish Date - Apr 16 , 2024 | 07:19 AM
శ్రీరామనవమికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. రేపు సీతారాముల కళ్యాణం కోసం మిథిలా ప్రాంగణం లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రాచలం: శ్రీరామనవమి (Sriramanavami)కి భద్రాద్రి (Bhadrachalam) సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. రేపు సీతారాముల కళ్యాణం కోసం మిథిలా ప్రాంగణం లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. భద్రాచలం వచ్చే భక్తులకు గోదావరి నూతన వారధిపై రాకపోకలు నిలిపివేశారు. 59 సంవత్సరాల తరువాత భద్రాచలం వద్ద గోదావరి రెండో వారధి ప్రారంభమైంది.
CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు
భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు ఉగాది నుంచే ప్రారంభమయ్యాయి. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. అదే రోజు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుుతున్నాయి. మూలవరులకు అభిషేకం, బేడా మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సవాంగస్నపనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక రేపటి కల్యాణం కోసం మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..