Share News

Bhaskar: అల్లు అర్జున్‌ తప్పు లేదు.. కేసు వెనక్కి తీసుకుంటా

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:44 AM

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ తప్పేమీ లేదని పుష్ఫ -2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భార్యను కోల్పోయిన భాస్కర్‌ స్పష్టం చేశారు.

Bhaskar: అల్లు అర్జున్‌ తప్పు లేదు.. కేసు వెనక్కి తీసుకుంటా

  • సంధ్య థియేటర్‌ ఘటనలో మృతురాలి భర్త వెంటిలేటర్‌పైనే కుమారుడు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ తప్పేమీ లేదని పుష్ఫ -2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భార్యను కోల్పోయిన భాస్కర్‌ స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ అరెస్టు నేపథ్యంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు శ్రీతేజ పుష్ప-2 సినిమా చూడాలని పట్టుబట్టడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లానని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఘటనలో అల్లుఅర్జున్‌ తప్పేమీ లేదని, కేసు ఉపసంహరించుకోవడానికి తాను సిద్ధమని వెల్లడించారు.


అల్లు అర్జున్‌ అరెస్టుపై పోలీసులు తనకేమీ సమాచారం ఇవ్వలేదని, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. కాగా, సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజకు చికిత్స కొనసాగుతోంది. శ్రీతేజకు తొమ్మిది రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. శ్రీతేజ ఆరోగ్యం కొంతమేర మెరుగుపడిందని, రక్త ప్రసరణ కూడా సాధారణ స్థితికి చేరుకుందన్నారు. ఆక్సిజన్‌ మోతాదు తగ్గించి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, శ్రీతేజ శరీరంలో ఎడమ వైపు స్పర్శ ఉందని, కుడివైపు భాగంలో స్పర్శ లేదని తెలిపారు. చికిత్స అందిస్తున్న సమయంలో అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, కానీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి క్షీణించలేదని వైద్యులు వెల్లడించారు.

Updated Date - Dec 14 , 2024 | 03:44 AM