Share News

BJP: 100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి..

ABN , Publish Date - Sep 13 , 2024 | 11:34 AM

సర్వేనెంబర్‌ ఒక దగ్గర ఉంటే మరొక దగ్గర నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆక్రమణకు గురవుతున్న 4 ఎకరాలకు పైగా రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని బీజేపీ(BJP) నాయకులు ఆకుల సతీష్‌, పీసరి కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అరుణ్‌రావు, కుమార్‌గౌడ్‌, ఎల్లస్వామి మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

BJP: 100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి..

- మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నాయకుల ఫిర్యాదు

హైదరాబాద్: సర్వేనెంబర్‌ ఒక దగ్గర ఉంటే మరొక దగ్గర నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆక్రమణకు గురవుతున్న 4 ఎకరాలకు పైగా రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని బీజేపీ(BJP) నాయకులు ఆకుల సతీష్‌, పీసరి కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అరుణ్‌రావు, కుమార్‌గౌడ్‌, ఎల్లస్వామి మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలించాలని అడిషనల్‌ కలెక్టర్‌, దుండిగల్‌ తహసీల్దార్‌కు ఫోన్‌లో కలెక్టర్‌ ఆదేశించారని బీజేపీ నాయకులు తెలిపారు.

city4.2.jpg

ఇదికూడా చదవండి: CM Revanth: లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ సీరియస్


ఆకృతి కన్‌స్ట్ట్రక్షన్‌పై చర్యలు తీసుకోవాలి..

నిజాంపేట్‌ కార్పొరేషన్‌(Nizampet Corporation) బాచుపల్లి మండలం, బాచుపల్లి(Bachupally) గ్రామంలో సర్వేనెంబర్‌ 453/1, 2లో ఆకృతి కన్‌స్ట్ట్రక్షన్‌ వారు అప్రోచ్‌రోడ్డు కోసం ప్రభుత్వభూమి సర్వేనంబర్‌ 454ను చూపిస్తూ అక్రమ అనుమతులు పొందడమే కాకుండా 360 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మేడ్చల్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, వినతి పత్రం సమర్పించారు.


.............................................................

ఈవార్తను కూడా చదవండి:

.............................................................

Pooja Bedi: నా జీవితంలో అన్నీ ప్రణాళిక ప్రకారమే జరిగాయి

- ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో పూజా బేడి

హైదరాబాద్‌ సిటీ: ‘నా జీవితంలో అన్నీ ప్రణాళిక ప్రకారమే జరిగాయి’ అని నటి పూజా బేడి(Pooja Bedi) తెలిపారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో), గచ్చిబౌలిలోని సత్వ నాలెడ్జ్‌ సిటీలో నిర్వహించిన ‘‘లిమిటేషన్‌ టు లిబరేషన్‌ అండ్‌ అన్‌లాక్‌ యువర్‌ ఇన్నర్‌ స్ట్రెంగ్త్‌’’ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. తాను ఏం చేసినా 100శాతం ఇవ్వడానికే కృషి చేస్తానన్నారు. ఆఖర్‌కు విడాకుల ప్రక్రియలో కూడా అలాగే వ్యవహరించానని చెప్పారు.

city5.3.jpg


పన్నెండేళ్ల సంతోషకరమైన వివాహ జీవితం కోసం మిగిలిన 50 ఏళ్లు కష్టపడుతూ ఉండాలని తాను అనుకోలేదన్నారు. అందుకే తాను స్వేచ్ఛను కోరుకున్నానని, అది సాధించానని ఆమె తెలిపారు. పుట్టుక, మరణం మధ్యలో ప్రయాణాన్ని అందంగా మలుచుకోవాలని, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని సూచించారు. ప్రతి ట్రాజెడీ తనను ఓ చక్కటి వ్యక్తిగా మార్చిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిక్కీ లేడీస్‌ సభ్యులు హాజరయ్యారు.

city5.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 13 , 2024 | 11:51 AM