BJP: తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలు
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:32 AM
ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.
హైదరాబాద్: ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.
కోరుట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలిచారు. మొదటిసారి పార్లమెంట్‌కు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘనందనరావులు వెళుతున్నారు. వరుసగా రెండోసారి ఎంపీలుగా గెలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. 2014 తర్వాత మళ్ళీ ఎంపీలుగా కొండా విశ్వేశ్వరరెడ్డి, గోడెం నగేష్ విజయం సాధించారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి జోష్ ఇచ్చాయనడంలో సందేహం లేదు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News