Share News

బీజేపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదిపై హత్యాయత్నం

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:33 AM

బీజేపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది కళ్యాణ్‌ వంశీకర్‌పై హత్యాయత్నం జరిగింది.

బీజేపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదిపై హత్యాయత్నం

ఖైరతాబాద్‌,నవంబరు12(ఆంధ్రజ్యోతి): బీజేపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది కళ్యాణ్‌ వంశీకర్‌పై హత్యాయత్నం జరిగింది. ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కళ్యాణ్‌ మంగళవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఖైరతాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి ఐమాక్స్‌ వైపు మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా ఈ దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఏం చేస్తున్నావని ప్రశ్నించి కత్తితో దాడి చేశారు. దాడిలో కళ్యాణ్‌ ఛాతీ కింద, మోచేతి కింద భాగంలో గాయాలయ్యాయి. మరో 3 చోట్ల స్వల్ప గాయాలయ్యాయి. దాడి అనంతరం దుండగులిద్దరూ అదే ద్విచక్ర వాహనంపై పారిపోయారు. ఆ వెంటనే కళ్యాణ్‌ తన సోదరుడైన ఖైరతాబాద్‌ బీజేపీ అధ్యక్షుడు ఆదర్శ్‌కు ఫోన్‌ చేసి తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఖైరతాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కళ్యాణ్‌కు రక్తస్రావం అవుతుండటంతో తొలుత గాంధీకి, అనంతరం గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Nov 13 , 2024 | 06:33 AM