BJP: అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం..
ABN , Publish Date - Feb 09 , 2024 | 09:13 AM
ప్రజా సమస్యలే అజెండాగా శాసనసభకు బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నారు. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ తరుఫున ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడనున్నారు.
హైదరాబాద్: ప్రజా సమస్యలే అజెండాగా శాసనసభకు బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నారు. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ తరుఫున ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడనున్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడనున్నారు.
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రి సమావేశమయ్యారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమాన దూరంలో ఉండాలని కమలం పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఉభయసభల్లో ఎండగట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యతను ఏలేటి మహేశ్వరరెడ్డి, పాయల్ శంకర్‌కు బీజేపీ అప్పగించింది.