Share News

BJP: 1 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు..

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:48 AM

సికింద్రాబాద్‌ నియోజకవర్గం(Secunderabad Constituency)లో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తలపెట్టిన బీజేపీ(BJP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మేకల సారంగపాణి పిలుపునిచ్చారు.

BJP: 1 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు..

హైదరాబాద్: సికింద్రాబాద్‌ నియోజకవర్గం(Secunderabad Constituency)లో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తలపెట్టిన బీజేపీ(BJP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మేకల సారంగపాణి పిలుపునిచ్చారు. శుక్రవారం నామాలగుండు బీఎన్‌ఆర్‌ గార్డెన్‌(BNR Garden)లో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.


రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి జంటనగరాల్లో నెంబర్‌వన్‌ స్థానంలో సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని నిలబెట్టాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారిని బీజేపీ సభ్యులుగా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్వీనర్‌గా నియమితులైన కనకట్ల హరిని నాయకులందరూ సత్కరించారు.


సికింద్రాబాద్‌ కన్వీనర్‌ కందాడి నాగేశ్వరరెడ్డి(Secunderabad Convenor Kandadi Nageswara Reddy) అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పి.రవిప్రసాద్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు రాచమల్ల కృష్ణమూర్తి, నాయకులు వేణుయాదవ్‌, వెంకటేశ్‌గౌడ్‌, శారదామల్లేష్‌, పోచయ్య, దిలీప్‌, ఆకారం రమేష్‌, డివిజన్‌ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు, హన్మంతు, రామువర్మ, శ్రీధర్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

...............................................................

Hyderabad: ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా భవ్యారెడ్డి

city6.jpg

తిరుమలగిరి(హైదరాబాద్): ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా అల్వాల్‌ లోతుకుంటకు చెందిన భవ్యారెడ్డి ఎన్నికయ్యారు. ఈనెల 13న ముంబై(Mumbai)లో పోటీలు నిర్వహించగా భవ్యారెడ్డి(Bhavya Reddy) ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. లోతుకుంటలో పుట్టి పెరిగిన భవ్యారెడ్డి ఏపీ నుంచి పోటీ చేసి ఫెమినా మిస్‌ ఇండియాగా ఎంపికవ్వడం విశేషం. ఈ సందర్భంగా భవ్యారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. మిస్‌ ఇండియా సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2024 | 11:48 AM