BJP: ప్రజలను మోసం చేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు..
ABN , Publish Date - Dec 06 , 2024 | 08:11 AM
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, ఈ ఏడాదిలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏ ఒక్క వర్గం ప్రజలకు చేసింది ఏమీ చేయలేని కాంగ్రెస్‌కు ఉత్సవాలు జరుపుకునే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు(Former MLC N. Ramachandra Rao) అన్నారు.
- వచ్చే ఎన్నికల్లో బీజేపీదే పీఠం: రామచందర్‌రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, ఈ ఏడాదిలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏ ఒక్క వర్గం ప్రజలకు చేసింది ఏమీ చేయలేని కాంగ్రెస్‌కు ఉత్సవాలు జరుపుకునే నైతిక హక్కు లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు(Former MLC N. Ramachandra Rao) అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విమానంలో ప్రయాణికుడి న్యూసెన్స్.. దుబాయ్ నుంచి శంషాబాద్ వస్తున్న ఫ్లైట్‌లో ఘటన
గురువారం రహ్మత్‌నగర్ డివిజన్ కార్మికనరగ్ ఆటో స్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్(Congress) పాలనలో అమలు కానీ గ్యారంటీలపై బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీవి అన్నీ అబద్దాలు రాజకీయాలు, కుంబకోణాల రాజకీయాలు, ఒకే కుటుంబ రాజకీయం చేస్తూ వారికి కావాల్సిన కొద్ది మందిని బాగుచేసుకునే రాజకీయాలు చేయటం పరిపాటి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జూబ్లీహిల్స్ నియోజక కన్వీనర్ కుంబాల గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇన్‌చార్జి లంకల దీపక్‌రెడ్డి, డి.ప్రేమ్‌కుమార్, అనంతలక్ష్మి, కొలను సత్యనారాయణ, సుప్రియగౌడ్, జ్జానేశ్వర్, పులిరామ్, బడుగు సతీష్, చంద్రమోహన్, వెంకటేష్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News