Payal Shankar: కాంగ్రెస్ హామీలపై చర్చకు పట్టుబడతాం
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:37 AM
కాంగ్రెస్ ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామని బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్ తెలిపారు. ఏడాది పాలనలో ప్రభు త్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు.
బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబడతామని బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్ తెలిపారు. ఏడాది పాలనలో ప్రభు త్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం శంకర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ అన్ని రంగా ల్లో విఫలమైందని శంకర్ ఆరోపించారు. మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్ల కూల్చివేత, రైతుల నుంచి బలవంతంగా భూసేకరణపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ హరీ్‌షబాబు, కే వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణగుప్తా, రామారావు పాటిల్ పాల్గొన్నారు. తన కుమార్తె వివాహ వేడుకల కారణంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్థానికంగా లేకపోవడంతో రాలేదని పేర్కొన్నాయి. కాగా, కాంగ్రె స్ ప్రభుత్వం ఏడాది పాలన సంబురాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఒక ప్రకటనలో విమర్శించారు.