BJP: అల్లు అర్జున్ అరెస్టు సరికాదు: పురందేశ్వరి
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:12 AM
సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సరికాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సరికాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమె విలేకరులతో మాట్లాడారు. పుష్ప-2 విడుదల సమయంలో అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారని, అక్కడ చోటుచేసుకున్న తొక్కిసలాట ఆయన ప్రేరేపించింది కాదని తెలిపారు. ఈ కేసులో మిగిలిన వారిని కాకుండా ఏ-11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సమంజసం కాదని ఆమె అన్నారు.
శాంతిభద్రతలపై చర్యలు చేపట్టాలి: హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, అల్లు అర్జున్ నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటన పూర్తిగా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అడుగంటుతున్న శాంతిభద్రతల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.