Breaking News: హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పాట..
ABN , First Publish Date - Sep 28 , 2024 | 06:45 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-28T20:18:59+05:30
ఏపీలో పెట్టుబడుల ప్రవాహం
అమరావతి: ఏపీలో పెట్టుబడులకు లులూ గ్రూప్ రెడీ
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్‌ను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
లులూ గ్రూప్ ఏపీకి తిరిగివచ్చినందుకు సంతోషిస్తున్నా
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు లులూ గ్రూప్ సిద్ధంగా ఉంది-సీఎం చంద్రబాబు
ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తాం
విశాఖ, విజయవాడ, తిరుపతిలో లులూ గ్రూప్ ప్రణాళికలపై చర్చించా-చంద్రబాబు
లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ ఆలీతో చర్చలు ఫలవంతం అయ్యాయి
వైజాగ్‌లో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ ఏర్పాటుకు సంసిద్ధత
-
2024-09-28T17:35:04+05:30
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కామెంట్స్
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మనందరి బాధ్యత: హైడ్రా కమిషనర్ రంగనాథ్
రెండు నెలల నుంచి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది
హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
హైడ్రాపై కొందరికే వ్యతిరేకత ఉంది.
-
2024-09-28T15:15:03+05:30
సూర్యాపేటలో మున్సిపల్ అధికారుల సర్వే
సూర్యాపేట: సూర్యాపేటలో మున్సిపల్ అధికారుల సర్వే
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అధికారులు సర్వే చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఇళ్ళను కూలగొట్టకుండా అడ్డుకుంటామని హామీ
తక్షణమే సర్వే పనులు నిలిపివేయాలని డిమాండ్
-
2024-09-28T14:53:08+05:30
కవిత కనిపించడం లేదు
నిజామాబాద్: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
కవిత కనిపించడం లేదని కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ నేత ఆదే ప్రవీణ్
లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత నిజామాబాద్‌లో కనబడటం లేదని ఫిర్యాదు
-
2024-09-28T13:53:58+05:30
హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పాట..
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పాట పాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
ఎనిమిది నెలల్లో జరిగిన విధ్వంసం పై స్వయంగా పాట పాడి వివరించిన బండి సంజయ్.
హైడ్రా అంశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు.
ఇప్పటి వరకు జరిగిన కూల్చి వేతలన్నీ హిందువులవే.
ముస్లిం లకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగ్ కూల్చలేదు.
హైడ్రా పేరుతో కొరివితో తల గోక్కుతుంది కాంగ్రెస్.
హైడ్రా కు బీజేపీ వ్యతిరేకం కాదు.
మీ నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారు.
రేపు మూసీ వల్ల పేద ప్రజలకు తీరని అన్యాయం జరగనుంది.
ముసి పేరిట లేని ఇబ్బందులు తెస్తున్నారు.
గతంలో ఒకాయన ఇలా అని ఫామ్ హౌస్‌లో పడుకున్నారు
జీతాలు ఇవ్వడానికి, ఋణమాఫీ, ఆరు గ్యారెంటిలకు డబ్బులు లేవు.
లోకల్ బడి ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డౌన్ అవుతుంది.
బిఅర్ఎస్, కాంగ్రెస్ లకు ఒకటే గతి పడుతుంది.
తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది.
-
2024-09-28T13:26:48+05:30
జానీ మాస్టర్‌కు మరో షాక్ ఇచ్చిన కోర్టు..
రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్‌కు షాక్.
కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచిన నార్సింగ్ పోలీసులు.
వచ్చే నేల 3వ తేదీ వరకు రిమాండ్ విధించిన కోర్టు.
అనంతరం చంచల్ గూడ జైలుకు తరలింపు.
-
2024-09-28T10:45:11+05:30
హైడ్రా విషయంలో గుడ్ న్యూస్.. ఏంటంటే..!
హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్.
ప్రజల్లో వ్యతిరేకతతో ఆచితూచి అడుగుతున్న హైడ్రా.
ఇవాల్టి కూల్చివేతలపై కూకట్ పల్లి మహిళ సూసైడ్ ఎఫెక్ట్.
మొదట రెండు రోజులపాటు భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్.
తర్వాత మూసి పరివాహ ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేయమంటూ ప్రకటన.
మూసి పరివాహక ప్రాంతాల్లో నిరసనలతో వెనుకడుగు వేసిన హైడ్రా.
మూసీ నివాసితుల ప్రాంతాల్లో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత.
మలక్ పేట్, మూసరాంబాగ్, చైతన్యపురి, కొత్తపేట మూసి ప్రాంతాల్లో నివాసితుల ఆందోళనలు.
మార్కింగ్‌కు వెళ్ళిన అధికారులకు సహకరించని మూసీ నివాసితులు.
స్థానికుల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన సర్వే.
-
2024-09-28T10:09:06+05:30
తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు..
మాజీమంత్రి కేటీఅర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన బాధితులు.
ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామంటోన్న బాధితులు.
ఎప్పుడు కులుస్తారో అని నిద్రకూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటున్న హైడ్రా బాధిత కుటుంబాలు.
బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామంటోన్న బాధిత కుటుంబాలు.
-
2024-09-28T09:44:36+05:30
జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్..
బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేసిన జానీ మాస్టర్ భార్య సుమలత.
కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసింది.
ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది.
నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది.
నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్‌పై తీవ్ర ఒత్తిడికి గురిచేసింది.
నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది.
కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది.
బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను.
బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది.
నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉంది.
ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు.
దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది.
పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది.
బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది.
ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత.
నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను.
-
2024-09-28T09:09:28+05:30
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక..
నల్సార్ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రాష్ట్రపతి.
ఉదయం 11:50 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్.
స్వాగతం పలకనున్న సిఎం రేవంత్ రెడ్డి.
అక్కడి నుంచి నేరుగా 12:20కి నల్సర్ యూనివర్సిటీలో జరిగే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
అనంతరం మధ్యాహ్నం 3:30కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం 2024ను రాష్ట్రపతి ప్రారంభింస్తారు.
సాయంత్రం 5:45కు హకీంపేట్ ఎయిర్‌ఫోర్టు నుంచి తిరిగి ఢిల్లీ పయనం.
రాష్ట్రపతి తో పాటు నల్సార్ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొననున్న సిఎం రేవంత్ రెడ్డి.
-
2024-09-28T06:45:14+05:30
హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..
సైబారాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన బాధితురాలు.
హర్షసాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని ఫిర్యాదు.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలని ప్రోత్సహిస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
రాజ్యాంగం కల్పించిన హక్కులని కాపాడమని హై కోర్ట్‌ని ఆశ్రహిస్తున్న బాధితురాలు.
హర్షసాయిపై లుకౌట్ నోటీస్ జారీ చేసే యోచనలో పోలీసులు.