Komatireddy: గులాబీ పార్టీ అధ్యాయం ముగిసింది.. బై బై బీఆర్ఎస్
ABN , Publish Date - Jun 05 , 2024 | 01:53 PM
బై బై బీఆర్ఎస్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగు నెలలకే రెఫరెండం అని ప్రజల్లోకి వెళ్లి ఓటు శాతం పెంచుకున్నామన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆవేదనలో, బాధలో ఉన్నారన్నారు. కేసీఆర్ బస్సు ఎక్కి తిరిగినా డిపాజిట్లు కూడా రాలేదన్నారు.
హైదరాబాద్: బై బై బీఆర్ఎస్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగు నెలలకే రెఫరెండం అని ప్రజల్లోకి వెళ్లి ఓటు శాతం పెంచుకున్నామన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆవేదనలో, బాధలో ఉన్నారన్నారు. కేసీఆర్ బస్సు ఎక్కి తిరిగినా డిపాజిట్లు కూడా రాలేదన్నారు. బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని.. కేసీఆర్ తన పార్టీ క్లోజ్ చేసుకుంటే మంచిదన్నారు. ఈ రిజల్ట్‌తో మాలో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా మా టీమ్ లీడర్ రేవంత్ నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. 15 ఏళ్లు అధికారంలో తామే ఉంటామని కోమటిరెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: షర్మిల
మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..
Read Latest Telangana News and National News