Share News

BRS: లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలి..

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:21 PM

ఫార్మా విలేజ్‌ కోసం సేకరించతలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన లగచర్ల రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసి జైలుకు పంపించిందని, వారిని బేషరతుగా విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ శాఖ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి(Ramidi Ram Reddy) డిమాండ్‌ చేశారు.

BRS: లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలి..

- రైతుల చేతులకు సంకెళ్లు వేయడం ప్రజా పాలనా?

- బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాంరెడ్డి ధ్వజం

హైదరాబాద్: ఫార్మా విలేజ్‌ కోసం సేకరించతలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన లగచర్ల రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసి జైలుకు పంపించిందని, వారిని బేషరతుగా విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ శాఖ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి(Ramidi Ram Reddy) డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పలుపు మేరకు బడంగ్‌పేట్‌(Badangpet)లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిల్‌ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సూర్ణగంటి అర్జున్‌, కార్పొరేటర్‌ పెద్దబావి శ్రీనివా్‌సరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఏరియాల్లో మూడురోజులుగా తాగునీటి సరఫరా బంద్‌..


- మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని జిల్లెలగూడ చౌరస్తాలో గల అంబేడ్కర్‌ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


city10.jpg

- లగచర్ల రైతుల అరెస్టు, రైతు చేతికి సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పలుపు మేరకు మంగళవారం సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి మాజీ కౌన్సిలర్‌ దర్పల్లి అశోక్‌, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డిల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సుశీలరెడ్డి, గోపాల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం

ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2024 | 01:21 PM