Share News

Prabhakar Reddy: మహిళా మంత్రి ఏడ్చారంటే సర్కారు వైఫల్యమే..

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:23 AM

‘సాక్షాత్తు ఓ మహిళా మంత్రి మీడియా ముందుకు వచ్చి ఏడ్చారంటే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి..?’ దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

Prabhakar Reddy: మహిళా మంత్రి ఏడ్చారంటే సర్కారు వైఫల్యమే..

  • ప్రతిపక్షాలను అడ్డుకునే సంస్కృతి తెచ్చారు: ప్రభాకర్‌రెడ్డి

  • దుబ్బాక ఎమ్మెల్యేను అడ్డుకోబోయిన కాంగ్రెస్‌ శ్రేణులు

దుబ్బాక, అక్టోబరు 3: ‘సాక్షాత్తు ఓ మహిళా మంత్రి మీడియా ముందుకు వచ్చి ఏడ్చారంటే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి..?’ దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. నిఘాసంస్థలు, పోలీసు, పాలన వ్యవస్థలుండి కూడా ఒక మంత్రిపై సోషల్‌మీడియాలో వచ్చిన ఆకతాయి కామెంట్లపై చర్యలు తీసుకోలేకపోతే.. ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని నిలదీశారు. గురువారం దుబ్బాకలో సీఎంఈవై చెక్కులను పంపిణీ చేసేందుకు వచ్చిన ఆయన మాట్లాడారు.


ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడం, అడ్డుకోవడం చూశామని.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం విఫలమై, ప్రతిపక్షాలను అడ్డుకునే సంస్కృతికి నాంది పలికిందని విమర్శించారు. కాగా, అంతకుముందు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని. స్థానిక శివాజీ విగ్రహం వద్ద అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలు విసిరేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఇటు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలూ వారిపైకి రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇరు వర్గాల వారిని సముదాయించి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Updated Date - Oct 04 , 2024 | 03:23 AM