Share News

Asifabad: పది రోజులకో బిడ్డ ప్రాణం పోతోంది

ABN , Publish Date - Nov 24 , 2024 | 05:03 AM

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత

Asifabad: పది రోజులకో బిడ్డ ప్రాణం పోతోంది

  • మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: కవిత

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను కవిత శనివారం పరామర్శించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతోందని, సగటున నెలకు ముగ్గురు చొప్పున ఇప్పటి వరకు 42 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆహారం విషతుల్యమవ్వడంతో మరణించారని అన్నారు. సగటున పది రోజులకో బిడ్డ ప్రాణం పోతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరణించిన 42 మంది పిల్లల కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 24 , 2024 | 05:03 AM