Medchal : బీఆర్‌ఎ్‌సకు మరో షాక్!
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:00 AM
మేడ్చల్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికనర్సింహారెడ్డి, ఆమె భర్త మర్రి నర్సింహారెడ్డి....
మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్
మర్రి దీపిక కాంగ్రె్‌సలో చేరిక
మేడ్చల్ టౌన్, జూలై 2 : మేడ్చల్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికనర్సింహారెడ్డి, ఆమె భర్త మర్రి నర్సింహారెడ్డి, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెరువుకొమ్ము శేఖర్‌గౌడ్, కౌన్సిలర్లు మర్రి శ్రీనివా్‌సరెడ్డి, ఎడ్ల శ్రీనివా్‌సరెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గీత మధుకర్‌లతో కలిసి మంగళవారం మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నక్క ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సకు చెందిన వైస్‌చైర్మన్‌తో సహా 13 మందికౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరిన విషయం విదితమే. తాజాగా మిగిలిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ప్రస్తుతం చైర్‌పర్సన్‌తో సహా ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరారు. చైర్‌పర్సన్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది కౌన్సిలర్లకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టడానికి గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న కౌన్సిలర్లకు చెక్ పెట్టడానికే చైర్పర్సన్ దీపిక కాంగ్రె్‌సలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. చైర్పర్సన్ దీపికనర్సింహారెడ్డి భర్త మర్రి నర్సింహారెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నక్క ప్రభాకర్గౌడ్లతో ఉన్న పరిచయాలు పార్టీ మారేందుకు కలిసొచ్చాయి.