Share News

Nizam sugar factories: తెరుచుకోనున్న నిజాం షుగర్స్‌!

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:21 AM

పరిశ్రమల శాఖకు ఈ సారి బడ్జెట్టులో నిరుటితో పోలిస్తే తక్కువ కేటాయింపులు దక్కాయి. నిరుడు రూ. 4037కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2762కోట్లు కేటాయించారు. ఈ సారి పారిశ్రామిక రాయితీలు ఇచ్చే అవసరం పెద్దగా లేకపోవడంతో కేటాయిం పులు తగ్గాయి.

Nizam sugar factories: తెరుచుకోనున్న నిజాం షుగర్స్‌!

  • బోధన్‌, మెట్‌పల్లి, మెదక్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రూ.132 కోట్లు

హైదరాబాద్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల శాఖకు ఈ సారి బడ్జెట్టులో నిరుటితో పోలిస్తే తక్కువ కేటాయింపులు దక్కాయి. నిరుడు రూ. 4037కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2762కోట్లు కేటాయించారు. ఈ సారి పారిశ్రామిక రాయితీలు ఇచ్చే అవసరం పెద్దగా లేకపోవడంతో కేటాయిం పులు తగ్గాయి. గతంతో పోలిస్తే రూ.1275కోట్లు తగ్గాయి. ఈసారి కొత్త పథకాలకు అధిక నిధులు కేటాయించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు కాంగ్రెస్‌ సర్కారు రూ. 138 కోట్లు కేటాయించింది. బోధన్‌, మెట్‌పల్లి, మెదక్‌లో ఉన్న ఈ ఫ్యాక్టరీలు డిసెంబరు-2015లో మూతపడ్డాయి.


వీటిలో తొలుత మెట్‌పల్లి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక స్కిల్‌ యూనివర్సిటీ కోసం రూ.75కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి 355కోట్లు కేటాయించారు. పరిశ్రమల విద్యుత్తు రాయితీకి రూ.250కోట్లు, పావలా వడ్డీకి రూ.250కోట్లు, ఇతర రాయితీలు, నిమ్జ్‌ భూసేకరణకు రూ.125కోట్లు, ముచ్చెర్ల ఫార్మాసిటీ స్థానంలో కొత్తగా ప్రకటించిన ఔషధ గ్రామాల్లో భూసేకరణ కోసం రూ.50కోట్లు, ఇతర రాయితీలకు మొత్తం రూ.986కోట్లు కేటాయించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి నిరుడు రూ.366కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.774కోట్లకు పెంచారు.

Updated Date - Jul 26 , 2024 | 05:21 AM