Share News

Candidates: 29 జీవోను రద్దు చేయాల్సిందే..

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:16 AM

జీవో 29 వల్ల తమ జీవితాలు నాశనమవుతాయని, కాబట్టి ఆ జీవోను రద్దు చేసి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Candidates: 29 జీవోను రద్దు చేయాల్సిందే..

  • అశోక్‌నగర్‌లో గ్రూప్‌- 1 అభ్యర్థుల ప్రెస్‌మీట్‌

  • అభ్యర్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిక్కడపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జీవో 29 వల్ల తమ జీవితాలు నాశనమవుతాయని, కాబట్టి ఆ జీవోను రద్దు చేసి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎవరో చెప్పిన మాటలు విని తమ భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. ఒక్కరోజు సమయం మాత్రమే ఉందని, తమతో ఒక్కసారి చర్చించి ఆ తర్వాతే సీఎం నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం అశోక్‌నగర్‌లో అభ్యర్థులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.


జీవో 29పై కోర్టులో కేసు నడుస్తోందని, ఈ జీవో రద్దు అయితే ఇప్పుడు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించినా, మళ్లీ నిర్వహించాల్సి వస్తుందని అన్నారు. దానివల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, అందుకే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నామని తెలిపారు. ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్న అభ్యర్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రెస్‌మీట్‌ పెట్టిన తమను అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సబబు అని అభ్యర్థులు ప్రశ్నించారు.

Updated Date - Oct 21 , 2024 | 03:16 AM