D Srinivas: డి. శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ABN , Publish Date - Jun 29 , 2024 | 09:14 AM
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.
అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని....తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని తెలిపారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. డీ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
డి. శ్రీనివాస్ మరణం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్నారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారన్నారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు మంత్రి తుమ్మల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి..
ఒక మంచి ఆత్మీయుడిని, అప్తుడిని కోల్పోయానని పోచారం తెలిపారు. నిజామాబాద్ జిల్లాల్లో మాకు డీఎస్ పెద్ద దిక్కు అని పేర్కొన్నారు. డీఎస్ ఏ పార్టీలో ఉన్నా తనతో మాత్రం ఆప్యాయంగా ఉండేవాడని పేర్కొన్నారు. తనను ప్రేమగా శీను అని పిలిచేవాడన్నారు.