Share News

ED: శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:47 AM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. శివ బాలకృష్ణ ఆస్తుల వివరాలు తెలుపాలని ఈడీ, ఐటీ అధికారులు ఏసీబీ అధికారులకు లేఖ రాశారు.

ED: శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Balakrishna) ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు శివ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు పైగా ఆస్తులను స్థిర, చరాస్తులను గుర్తించారు. శివ బాలకృష్ణ ఆస్తుల వివరాలు తెలుపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్ కం టాక్స్ అధికారులు ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. బాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తమకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. శివ బాలకృష్ణ కేసును మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ బినామీ ఆస్తులపై విచారించేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. శివ బాలకృష్ణ ఆస్తులు బహిరంగ మార్కెట్‌లో రూ.250 కోట్లు వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం శివ బాలకృష్ణ చంచల్ గూడ జైలులో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 11:47 AM