Home » Praneeth Rao
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను చార్జ్‌షీట్‌లో వివరించారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని-- టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. పోలీసుల విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో ప్రణీతరావు ఇచ్చిన వాంగ్మూలంలో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు.
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళలను సైతం పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు.
తీగ లాగితే డొంకే కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. నల్లగొండకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్లు వారిపై అభియోగాలొచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది.