IAS officers: తెలంగాణకు ఇద్దరు కొత్త ఐఏఎ్‌సలు
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:51 AM
తెలంగాణకు మరో ఇద్దరు కొత్త ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2023 సివిల్ సర్వీస్ పరీక్ష(సీఎ్‌సఈ)లో
హైదరాబాద్, న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు మరో ఇద్దరు కొత్త ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2023 సివిల్ సర్వీస్ పరీక్ష(సీఎ్‌సఈ)లో ఉత్తీర్ణులైన మొత్తం 32 మంది ఐఏఎస్ అధికారులను దేశంలోని 25 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో బిహార్‌కు చెందిన 23వ ర్యాంకర్ సౌరభ్ శర్మ, హరియాణాకు చెందిన 29వ ర్యాంకర్ సలోని ఛబ్రాను తెలంగాణకు పంపింది. తెలంగాణకు చెందిన మూడో ర్యాంకర్ దోనూరు అనన్య రెడ్డి, 27వ ర్యాంకర్ నందాల సాయికిరణ్‌లను మహారాష్ట్రకు కేటాయించింది.