Employment Guarantee: ‘ఉపాధి’లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం
ABN , Publish Date - Oct 29 , 2024 | 05:07 AM
ప్రతి ఏటా ఉపాధి హామీ నిధుల కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం తగ్గిస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి బి. వెంకట్ ఆరోపించారు.
కేంద్రం తీరుపై వచ్చే నెల 26న ఆందోళనలు
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం
న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా ఉపాధి హామీ నిధుల కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం తగ్గిస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి బి. వెంకట్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తున్న తీరుపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకట్ మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నవంబర్ 26న అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు వెంకట్ తెలిపారు.