Share News

Siddipet: బైరాన్‌పల్లిలో చాళుక్యుల నాటి శిల్పం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:21 AM

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో చాణుక్యుల నాటి జైన సర్వోతభద్ర శిల్పం బయల్పడింది. ఈ గ్రామంలో అంగడి వీరన్న శివాలయంగా పిలుస్తున్న పురాతన జైనాలయం ఉంది.

Siddipet: బైరాన్‌పల్లిలో చాళుక్యుల నాటి శిల్పం!

ధూళిమిట్ట, జూన్‌ 10: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో చాణుక్యుల నాటి జైన సర్వోతభద్ర శిల్పం బయల్పడింది. ఈ గ్రామంలో అంగడి వీరన్న శివాలయంగా పిలుస్తున్న పురాతన జైనాలయం ఉంది. ఈ ఆలయం ముందు చాలా రోజులుగా గ్రామానికి చెందిన కుందరం నరేశ్‌ ఆవులను కట్టివేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆవులను కట్టివేుసిన ప్రదేశంలో చిన్న గుంత ఏర్పడి, అక్కడ ఓ స్తంభంలాంటిది కనిపించింది. దీంతో గ్రామస్థులు దానిని బయటకు తీసి, పురావస్తు శాఖకు సమాచారమందించారు. స్తంభాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారి శ్రీనివాస్‌.. దాన్ని 5 అడుగుల ఎత్తైన జైన చౌముఖి (నాలుగు వైపుల చెక్కిన) శిల్పంగా గుర్తించారు.


నాలుగు అంతస్తులుగా చెక్కిన ఈ శిల నలువైపులా 24వ జైన తీర్థంకరుడు, ధ్యాన శిల్పాలు ఉన్నాయి. శిల శిఖరాన వృషభమూర్తి రూపం చెక్కిఉంది. అంతస్తులో మహ వీరుడు ఉన్నాడనీ, ఆయనకి ఇరువైపులా చామరలు వీస్తున్నారని, కింద నాలుగు వైపులా మూడు సింహలు చెక్కి ఉన్నాయని శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jun 11 , 2024 | 04:21 AM