Chennai: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉండాలి..
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:33 PM
తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఉండాలని ఆ పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ, అండమాన్, తమిళనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జ్ కలిశెట్టి అప్పలనాయుడు(Kalisetti Appalanaidu) ఆకాంక్షించారు. చెన్నై టీడీపీ విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్నానగర్ టవర్ క్లబ్‌లో మంగళవారం ప్రారంభించింది.
- విజయనగరం ఎంపీ అప్పలనాయుడు
- సామాన్యులకు అండగా ఉంటాం: చెన్నై టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్
చెన్నై: తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఉండాలని ఆ పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ, అండమాన్, తమిళనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జ్ కలిశెట్టి అప్పలనాయుడు(Kalisetti Appalanaidu) ఆకాంక్షించారు. చెన్నై టీడీపీ విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్నానగర్ టవర్ క్లబ్‌లో మంగళవారం ప్రారంభించింది. ఇందులో ఎంపీ కలిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: TDP: హైదరాబాద్‌లో.. టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
చెన్నై టీడీపీ ఫోరం సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారని ప్రశంసించారు. నగరంలోని ప్రజలను చైతన్యవంతుల్ని చేసి పార్టీ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. టీడీపీలో కార్యకర్త అయిన తనను పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ గుర్తించి, విజయనగరం ఎంపీ స్థానాన్ని తనకిచ్చారన్నారు. పార్టీ మనకు ఏం ఇచ్చిందని కాకుండా, పార్టీకి మనం ఏం చేశామన్నది ముఖ్యమన్నారు. తెలుగు ప్రజల గౌరవ ప్రతిష్ఠలు మరింతగా పెరిగేలా చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తారన్నారు.
సామాన్య ప్రజలకు అండగా ఉంటాం: చంద్రశేఖర్
చెన్నైలోని సామాన్య తెలుగు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక వారధిగా ఉంటూ సామాజిక బాధ్యతతో కృషి చేస్తామని చెన్నై టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై నగరంలో అనేక మంది తెలుగు ప్రజలు ఉన్నత స్థితిలో ఉండగా, మరికొందరికి రాజకీయ పలుబడి ఉందన్నారు. కానీ, కింది స్థాయిలో సామాన్య తెలుగు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే, దాన్ని పరిష్కరించేవారు, సాయం చేసేవారు లేరన్నారు.
ఇలాంటి సమయంలో తాము పార్టీపరంగా కాకుండా, ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించి సాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. చెన్నై నగరంలోని ప్రతి ఒక్క తెలుగువారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలని, టీడీపీ గుర్తింపు కార్డు కలిగివుండటం ఒక గౌరవంగా, హక్కుగా భావించాలన్నారు. పార్టీ మనుగడ సాగించాలంటే కేవలం కార్యకర్తలు ఉంటే సరిపోరని, ఆర్థిక వనరులు కూడా ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పార్టీకి విరాళాలివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
అండమాన్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్: మాధవ నాయుడు
అండమాన్‌లో టీడీపీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు అన్నారు. గతంలో అక్కడ టీడీపీ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచారని గుర్తు చేశారు. అలాగే, చెన్నైలో టీడీపీని అభివృద్ధి చేయాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు రామాంజనేయులు, మన్నూరు చలపతి, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ సభ్యుడు రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేత కనకాల నిర్మలమ్మ తన పింఛను డబ్బుల నుంచి పార్టీ నిధికి రూ.2 లక్షలు, మన్నూరు చలపతి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News