Breaking News: సీఎం రేవంత్ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!
ABN , Publish Date - Apr 08 , 2024 | 03:30 PM
CM Revanth Convoy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో (Kodangal) పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో (Kodangal) పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు.
టార్గెట్ గెలుపు!
మండలాలవారీగా కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు వివిధ మండలాల సమన్వయ కమిటీ నాయకులు హాజరయ్యారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కూడా సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్ని స్వామి వారికి సీఎం పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.
Phone Tapping: పోలీసుల దర్యాప్తు వేగవంతం.. ఎన్నిచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారంటే?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి