Share News

CM Revanth Reddy: కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే.. డిపార్టుమెంటే ఉండదు

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:10 AM

‘‘నీటి పారుదల శాఖలో 50 శాతానికిపైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లే ఉన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదు.

CM Revanth Reddy: కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే.. డిపార్టుమెంటే ఉండదు

  • నీటిపారుదల శాఖలో సగానికి పైగా ఆ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్లే

  • వందేళ్ల కిందట కట్టినవి నిక్షేపంగా ఉన్నాయి

  • లక్ష కోట్ల కాళేశ్వరం కట్టడం, కూలడం మన కళ్ల ముందే..

  • తప్పిదం ప్రజా ప్రతినిధులదా!? ఈఎన్సీ, ఇతర ఇంజనీర్లదా?

  • ఎలాంటి తప్పు చేయకూడదో చెప్పే ప్రత్యక్ష సాక్షి కాళేశ్వరం

  • 1.9 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు

  • ఈ రాష్ట్రం మనది.. అంతా కలిసికట్టుగా నిర్మించుకుందాం

  • కొత్త ఇంజనీర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపు

  • పైరవీలు చేస్తే అడవిలో పోస్టింగ్‌ ఇస్తామని హెచ్చరిక

  • 687 మంది ఏఈఈలకు నియామక పత్రాల అందజేత

  • కొత్త ఇంజనీర్లకు క్షేత్రస్థాయిలోనే పోస్టింగ్‌: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘నీటి పారుదల శాఖలో 50 శాతానికిపైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లే ఉన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే.. వారినే కొనసాగిస్తున్నారని మేం ఆరోపణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏరకంగా విశ్లేషించాలో తెలియడం లేదు. ప్రతిరోజూ వీళ్లంతా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ముందుకు వెళ్లి.. ప్రాజెక్టు అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆయన అడిగిన ప్రశ్నలకు మాత్రం వీళ్ల దగ్గర సమాధానాలు లేవు. ఎవర్ని ఎవరు రక్షించాలో వాళ్లకు అర్థం కావడం లేదు’’ అంటూ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ కట్టి వందేళ్లు దాటాయని, హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తూ నగరాన్ని రక్షిస్తున్నాయంటే వాటి నిర్మాణంలో భాగస్వామి అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యే కారణమని చెప్పారు. ‘‘లక్ష కోట్లతో కట్టిన తర్వాత కూలిన కాళేశ్వరం ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా!? వందేళ్లైనా చెక్కుచెదరని ప్రాజెక్టులు కట్టిన విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుంటారో తొలిరోజు ఉద్యోగంలో చే రుతున్న ఇంజనీర్లే ఆలోచించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు గురువారం జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘నీటి పారుదల శాఖలో 50 శాతానికిపైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లే ఉన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే.. వారినే కొనసాగిస్తున్నారని మేం ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏరకంగా విశ్లేషించాలో తెలియడం లేదు. ప్రతిరోజూ వీళ్లంతా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ముందుకు వెళ్లి.. ప్రాజెక్టు అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయ త్నం చేస్తున్నారు. కానీ, ఆయన అడిగిన ప్రశ్నలకు మాత్రం వీళ్ల దగ్గర సమాధానం లేదు. ఎవర్ని ఎవరు రక్షించాలో వాళ్లకు అర్థం కావడం లేదు’’ అంటూ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు.


ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ కట్టి వందేళ్లు దాటాయని, హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తూ నగరాన్ని రక్షిస్తున్నాయంటే వాటి నిర్మాణంలో భాగస్వామి అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యే కారణమని చెప్పారు. ‘‘లక్ష కోట్లతో కట్టిన తర్వాత కూలిన కాళేశ్వరం ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా!? వందేళ్లైనా చెక్కుచెదరకుండా ప్రాజెక్టులు కట్టిన విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుంటారో తొలిరోజు ఉద్యోగంలో చేరుతున్న ఇంజనీర్లే ఆలోచించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా కొత్తగా నియమితులైన ఇంజనీర్లకు గురువారం జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును మ్యాన్‌ మేడ్‌ వండర్‌ అని ప్రచారం చేసుకున్నారు.


కానీ, ఇండియాలో మ్యాన్‌ మేడ్‌ వండర్స్‌ భాక్రానంగల్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకు.. శ్రీశైలం నుంచి శ్రీరాంసాగర్‌ దాకా ఇంజనీర్లు కట్టినవే. మ్యాన్‌ మేడ్‌ వండర్‌ అంటే ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లు. హైదరాబాద్‌కు వరదలు వచ్చి వేలాదిమంది చనిపోతే నిజాం గ్లోబల్‌ టెండర్లు పిలిచి వాటిని నిర్మించారు. విశ్వేశ్వరయ్యకు బాధ్యతలు అప్పగించి, కట్టిస్తే నిక్షేపంగా ఉన్నా యి. కానీ, లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం నుంచి నికరంగా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం.. కూలడం మన కళ్ల ముందే జరిగింది. ఈ తప్పిదం ఎందుకు జరిగింది? ప్రజా ప్రతినిధుల వల్లా!? ఈఎన్‌సీ, సీఈ, ఎస్‌ఈల వల్లా!? అనే విషయాలను ఆ శాఖలో చేరే ఇంజనీర్లు తేల్చాలి. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలో కూడా మీరే చెప్పాలి. వారికి ఇదొక మోడల్‌ స్టడీగా రిసెర్చి చేయడానికి పనికొస్తుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.


  • ప్రత్యక్ష సాక్షిలా కాళేశ్వరం

అధికారులు ఎలాంటి తప్పు చేయకూడదో చెప్పేందుకు మన కళ్ల ముందు ప్రత్యక్ష సాక్షిలా కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఏదైనా ఇంజనీరింగ్‌ మిస్టేక్‌ జరిగితే.. లేదా డిజైన్లు/డ్రాయింగ్‌లకు సీఈ సీడీవో ఆమోదం లేకపోతే క్షేత్రస్థాయిలో పని చేసే ఇంజనీర్లు తిరస్కరించేవారు. నోట్స్‌ రాసేవారు. తిరిగి సరైన మార్గనిర్దేశం చేయాలని చెప్పేవారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అడ్డుకొని, వెనక్కి పంపిస్తే తప్పులు జరగవు’’ అని వివరించారు. ఒక దేశ గొప్పతనాన్ని చూపించాలంటే అక్కడ కట్టిన నిర్మాణాలను చూపుతారని, స్టాచూ ఆఫ్‌ లిబర్టీ, ఈఫిల్‌ టవర్‌ ఇంజనీర్లు కట్టినవేనని, ఇంజనీర్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించగలరని, వారి శక్తి అలాంటిదని వ్యాఖ్యానించారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం మొదలు పెట్టిన ప్రాణహిత- చేవెళ్ల పూర్తికాలేదు. పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, దేవాదుల ఎక్కడున్నాయో మీకు తెలుసు. రూ.1.90 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసినా పదేళ్లలో ఏ ప్రాజెక్టూ పూర్తికాకపోవడానికి కారణమేంటి!? దీనికి కారకులు ఎవరని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటే ఫలితముండదు. భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. ఈ రాష్ట్రం మనది. ఈ రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. మీరు, నేను అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని నిర్మించుకుందాం’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.


  • నీళ్లతో ప్రజల భావోద్వేగం ముడిపడి ఉంది

‘‘తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్ల పాత్ర కీలకం. ఆ నీటికి మీరే ప్రతినిధులు. రెండోది నియామకాలు! తెలంగాణ వచ్చిన తర్వాత 11 ఏళ్లపాటు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్‌ చొరవ తీసుకొని నియామక ప్రక్రియను పూర్తి చేశారు. నీటి తో తెలంగాణ ప్రజల భావోద్వేగం ముడిపడి ఉంది. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని ప్రజలకు అందించే బాధ్యత మీది’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.


  • మోక్ష గుండం, నవాబ్‌జంగ్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి: మంత్రి ఉత్తమ్‌

కొత్తగా నియమితులయ్యే ఇంజనీర్లు ప్రఖ్యాత ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అలీ నవాబ్‌ జంగ్‌ల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. వారు నిర్మించిన ప్రాజెక్టులు వందేళ్లైనా చెక్కు చెదరలేదని గుర్తు చేశా రు. కొత ్తగా నియమితులయ్యే 687 మందికి హైదరాబాద్‌లో కాకుండా క్షేత్రస్థాయిలోనే పోస్టింగులు ఇస్తున్నామని, నీటిపారుదల శాఖను బలోపేతం చేయడానికి 281 మంది హెల్పర్లు, 1597 మంది లష్కర్‌ల నియామకానికి సీఎం అంగీకారం తెలిపారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఆదిత్య నాథ్‌దాస్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా కేటగిరీల్లో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 మంది ఇంజనీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు.


  • పైరవీలు చేస్తే అడవిలోనే పోస్టింగ్‌

‘‘ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. పోస్టింగ్‌ల కోసం సిఫారసులు తెస్తే.. దూరంగా అడవిలో పోస్టింగ్‌ వేయాలి’’ అని మంత్రి ఉత్తమ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ కోరారు. ఎవరైనా కాగితం పట్టుకొని వస్తే.. ఉదయం తిని ఫీల్డ్‌కు పోతే మళ్లీ రాత్రి ఇంటికి వచ్చే ప్రాంతంలో పోస్టింగ్‌ వేయాలని, అప్పుడే పని మీద ఫోకస్‌ ఉంటుందని వ్యాఖ్యానించారు. మీకందరికీ ఇది మంచి అవకాశమని, ఐదేళ్లలో నిర్దేశిత లక్ష్యాలతో పనిచేద్దామని అన్నారు. కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసుకుంటే ఏ రాష్ట్రం పోటీ పడనంతగా ముందుకు వెళతామని అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని, వాటిపై ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 27 , 2024 | 04:10 AM