Share News

Manmohan Singh: దేశ నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు: రేవంత్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:16 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్‌ సింగ్‌ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరని కొనియాడారు.

Manmohan Singh: దేశ నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు: రేవంత్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్‌ సింగ్‌ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరని కొనియాడారు. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుతోపాటు దేశ అభివృద్ధికి ఆయన తీసుకున్న అనేక చరిత్రాత్మక నిర్ణయాలను చరిత్ర సదా గుర్తు పెట్టుకుంటుందని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్‌ బాబు పేర్కొన్నారు. దూరదృష్టి గల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మన్మోహన్‌ సింగ్‌ మరణం దేశానికి తీరని లోటని మంత్రి సీతక్క అన్నారు. మన్మోహన్‌ సంస్కరణల రూపశిల్పి అని దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్థిక మేధావి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.


తెలంగాణకు సంపూర్ణ మద్దతు: కేసీఆర్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణంపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్‌ సింగ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ నిశ్శబ్ద వాస్తుశిల్పి మన్మోహన్‌ అని కేటీఆర్‌ కొనియాడారు.


ప్రతి పదవికీ వన్నె తెచ్చారు: కిషన్‌ రెడ్డి

మన్మోహన్‌సింగ్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా, ప్ర ణాళికా సంఘం సభ్యుడిగా, యూజీసీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానిగా చేసిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అ న్నారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. దేశానికి మన్మోహన్‌ అందించిన సేవలు మరువలేనివని కేంద్రమంత్రి బండిసంజయ్‌ కొనియాడారు.


ప్రధానిగా అత్యున్నత సేవలు: నారాయణ

యూపీఏ హయాంలో పదేళ్ల పాటు మన్మోహన్‌ సింగ్‌ దేశానికి ప్రధానిగా అత్యున్నత సేవలు అందించారని సీపీఐ జాతీయ నేత కే.నారాయణ కొనియా డారు. కొల్లేరు ప్రక్షాళనపై పోరాడినందుకు తనను ఓసారి ఢిల్లీలో అభినందించారని, కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారని ఆయన గుర్తుచేసుకున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 05:16 AM