CM Revanth: నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో ఎవరూ ఉండరు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Mar 11 , 2024 | 06:58 PM
తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెంట ఉండరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. మణుగూరులో సోమవారం నాడు జరిగిన ప్రజా దీవెన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెంట ఉండరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. మణుగూరులో సోమవారం నాడు జరిగిన ప్రజా దీవెన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి, కొడుకులు.. మామా, అల్లుడు రోజు తనకు శాపనార్థాలు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనను చూసి వారు అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావు దూలం లెక్క పెరిగిండు కానీ బుద్ది మాత్రం పెరగలేదని ఆరోపించారు. కేసీఆర్ చార్లెస్ శోభ రాజ్ లెక్క తయ్యారయ్యారని ఎద్దేవా చేశారు. ఖమ్మం ఒంటి కన్ను శివరాజ్ (మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ని ఉద్దేశించి) ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ చీకట్లో ఒప్పందం చేసుకున్నారన్నారు. మోదీ, ఖేడీ ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్, కరకట్ట, పులుసు బొంత ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
భద్రాచలంలో శ్రీ రామచంద్రుడు ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలతో ‘అభయ హస్తం’ గ్యారంటీ ఇచ్చారని చెప్పారు. కరీంనగర్‌లో ఇచ్చిన మాట ప్రకారం సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఖమ్మం గడ్డ పైనే పురుడు పోసుకుందని వివరించారు. కేసీఆర్ అనేక హామీలిచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని మండిపడ్డారు. గడిచిన మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఖమ్మం జిల్లా ప్రజలు వంద మీటర్ల లోతులో బొంద తీసి పెట్టారని అన్నారు. ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని చెప్పారు. రేణుకా చౌదరి, బలరాం నాయక్‌ను కేంద్ర మంత్రులను చేసి మీ జిల్లాకు పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. దేశంలోనే 39 ఎంపీ సీట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ ఎంపీ సీటును ప్రకటించి మీ జిల్లా గొప్పతనాన్ని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తించిందని చెప్పారు. తెలంగాణ ఆడ బిడ్డల జీవితాల్లో వెలుగుల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీ పథకాలకు రూప కల్పన చేశారని చెప్పారు. పేదలకు కరెంట్ బిల్లులు భారం లేకుండా ఉచిత కరెంట్‌ను మీ కళ్లలో వెలుగుల కోసం జీరో బిల్లులు తీసుకువచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి