Share News

CM Revanth Reddy: తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌..

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:08 AM

చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.

CM Revanth Reddy: తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌..

  • రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు ప్రజలను జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని.. అందుకే ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు.


తన జీవితం మొత్తం తెలంగాణకు ధారపోసి, రాష్ట్ర ఏర్పాటుకు ముందే అన్ని రంగాల్లో మనకున్న ఉజ్వల భవిష్యత్తును వీక్షించిన స్వాప్నికుడని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అఽధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ సొంతూరు అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.


బోనాలకు రండి..

ఆషాఢ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహించే గోల్కొండ, సికింద్రాబాద్‌, లాల్‌దర్వాజ బోనాలకు హాజరవ్వాలని కోరుతూ ఆయా దేవాలయాల కమిటీల ప్రతినిధులు, అర్చకులు సీఎం రేవంత్‌కు ఆహ్వానం అందజేశారు.

Updated Date - Jun 21 , 2024 | 05:08 AM