Share News

CM Revanth Reddy: ఈవీఎంలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jul 04 , 2024 | 08:03 PM

తెలంగాణలో 2029వరకూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఐదేళ్లకోసారి, తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 CM Revanth Reddy: ఈవీఎంలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ: తెలంగాణలో 2029వరకూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఐదేళ్లకోసారి, తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


పోలింగ్ రోజున రిజర్వులో ఉండే 15శాతం ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాటిని అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదని సీఎం చెప్పుకొచ్చారు. మూసీ నది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నట్లు చెప్పారు. 55కిలోమీటర్ల మేర మూసీ నదిపై రోడ్డు, రైళ్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో నిరాశ్రయులయ్యే 10వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలనలో ముఖ్యమంత్రిగా ముద్ర వేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Srinivas Goud: మా మండలాలను మాకు ఇవ్వాలి: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

CM Revanth Reddy: ప్రధానితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?

Crime News: పోలీసుల దాష్టీకం.. బాధితుడినే చితకబాదిన వైనం..

Minister Thummala: మా గోడు పట్టించుకోండి.. భద్రాచలం విలీన గ్రామాల నేతలు..

Updated Date - Jul 04 , 2024 | 08:03 PM