CM Revanth Reddy: త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:48 AM
తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు.
బలహీన వర్గాల కోసం తపించిన వ్యక్తి: సీఎం రేవంత్
27న అధికారికంగా బాపూజీ జయంతి
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.
ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయటంతో పాటు నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారన్నారు. కాగా, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఈ నెల 27న అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.