MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:57 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నెలాఖరులోగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు.
పథకాలు, యువతను ఆకట్టుకునేలా ప్రచారం
ఓటర్ల నమోదు ప్రక్రియను వెంటనే చేపట్టాలి
నెలాఖరులోగా అభ్యర్థి ఎంపిక: సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నెలాఖరులోగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, యువతను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలన్నారు. టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై శుక్రవారం జూమ్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పలు నియామకాల గురించి వివరించిన సీఎం రేవంత్.. టీపీసీసీ అధ్యక్షుడిగా మహే్‌షగౌడ్ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో పకడ్బందీగా పనిచేయాలని పేర్కొన్నారు.
పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని, ఇందుకోసం ఎన్‌ఎ్‌సయూఐ, యువజన కాంగ్రె్‌సతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15 నాటికి ఎన్నికల సమన్వయ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు, వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థి ఎంపికపై సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. మహే్‌షగౌడ్ మాట్లాడుతూ.. తక్షణమే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో ఉన్నందున ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు చాలా కీలకమని సిటింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అభ్యర్థి ఎంపిక, ఓటర్ల నమోదును నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ, కరీంనగర్, మెదక్ జిల్లాల మంత్రులు, నాలుగు జిల్లాల పరిధి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.