Share News

Mahankali Temple: రేవంత్‌ ఆలోచన మారాలని మొక్కుకున్నా

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:02 AM

కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని మహాంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తెలిపారు.

Mahankali Temple: రేవంత్‌ ఆలోచన మారాలని మొక్కుకున్నా

  • కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి: వీహెచ్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/అంబర్‌పేట, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని మహాంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తెలిపారు. ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా అంబర్‌పేట మహాంకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం వీహెచ్‌ మాట్లాడుతూ.. మహాంకాళి అమ్మవారి దయ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ప్రోత్సాహంతో నాలుగేళ్లలోనే రేవంత్‌ సీఎం అయ్యారన్నారు. 75 యేళ్లుగా అన్యాయానికి గురవుతున్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే జనాభా ప్రతిపాదికన ఆ వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని చెప్పారు.


  • టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌గా దేవేందర్‌రెడ్డి..

టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ అంతర్జాతీయ వ్యవహారాల విభాగం సమన్వయకర్తగా హైదరాబాద్‌ అమీర్‌పేట్‌కు చెందిన నంగి దేవేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆదివారం టీపీసీసీ ప్రవాస భారతీయుల విభాగం అంబాసిడర్‌ బీఎం వినోద్‌కుమార్‌ దేవేందర్‌రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు.

Updated Date - Jul 29 , 2024 | 03:02 AM