Share News

CM Revanth Reddy: ఢిల్లీ చేరిన సీఎం రేవంత్‌

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:27 AM

ఉగ్రవాద నియంత్రణ అంశంపై కేంద్ర హాం శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగే సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు.

CM Revanth Reddy: ఢిల్లీ చేరిన సీఎం రేవంత్‌

  • ఉగ్రవాద నియంత్రణ సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి

  • వరద, ఇతర సాయాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద నియంత్రణ అంశంపై కేంద్ర హాం శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగే సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు. ఆదివారం సాయంత్రమే ఆయన దేశ రాజధాని చేరుకున్నారు. సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోం శాఖ ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు అనంతరం ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదలు వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టానికి అదనపు సాయం కోరడంతోపాటు, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు.


కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ దొరికితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు కూడా సోమవారం ఢిల్లీ వెళతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రులు తమను కలిసేందుకు సమయం ఇవ్వకపోతే సీఎం రేవంత్‌ సోమవారం రాత్రే రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారు. కాగా, హరియాణా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వెల్లడైన నేపథ్యంలో.. పార్టీ పెద్దలను కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు చెబుతారని సమాచారం. అలాగే, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, హైడ్రా కార్యకలాపాలు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం తదితర అంశాలపై కూడా పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశముంది.

Updated Date - Oct 07 , 2024 | 03:27 AM