Share News

Collector: చెరువులు, నాలాల వద్ద జాగ్రత్త..

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:14 PM

రెండురోజులపాటు భారీ వర్షాలు కురవనుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Hyderabad Collector Anudeep Durishetti) సూచించారు.

Collector: చెరువులు, నాలాల వద్ద జాగ్రత్త..

- ప్రజలకు కలెక్టర్‌ పిలుపు

- రేపు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు

హైదరాబాద్: రెండురోజులపాటు భారీ వర్షాలు కురవనుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Hyderabad Collector Anudeep Durishetti) సూచించారు. ప్రధానంగా లోతట్టు, చెరువుల పరీవాహక ప్రాంతాలు, నాలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌(Collector Anudeep) మాట్లాడారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆటోలో ఎక్కించుకుంటారు.. ఫోన్‌ కొట్టేస్తారు


వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. జిల్లాలో 59 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీస్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు నిరంతరం విధుల్లో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం 040-23202813/9063423979, హైదరాబాద్‌ ఆర్డీవో- 7416818610/9985117660, సికింద్రాబాద్‌ ఆర్డీవో- 8019747481 లను సంప్రదించాలని తెలిపారు.


.......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................

In-charge Minister: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి..

- హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం

హైదరాబాద్: భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌వర్క్స్‌, డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, విద్యుత్‌ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(In-charge Minister Ponnam Prabhakar) ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, 141 వాటర్‌ లాగింగ్‌ పాయింట్ల వద్ద సిబ్బంది వెంటనే వరద వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పురాతన భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలన్నారు.

city2.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 01 , 2024 | 12:17 PM