Collector: ఏందీ చెత్త.. ఇలాఉంటే రోగాలు రావా?
ABN , Publish Date - Aug 29 , 2024 | 09:18 AM
‘ఏందీ చెత్తా చెదారం? నీటి నిల్వలు ఉంటే దోమలు వృద్ధి చెందవా? ఇంత అధ్వానంగా ఉంటే వ్యాధులు ఎందుకు రావు? మీరంతా ఏం చేస్తున్నారు? క్షేత్రస్థాయిలో పర్యటించరా?’ అని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్(Hyderabad Collector Anudeep) జీహెచ్‌ఎంసీ ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఖాదర్‌పై అసహనం వ్యక్తం చేశారు.
- కలెక్టర్ అనుదీప్ అసహనం
హైదరాబాద్: ‘ఏందీ చెత్తా చెదారం? నీటి నిల్వలు ఉంటే దోమలు వృద్ధి చెందవా? ఇంత అధ్వానంగా ఉంటే వ్యాధులు ఎందుకు రావు? మీరంతా ఏం చేస్తున్నారు? క్షేత్రస్థాయిలో పర్యటించరా?’ అని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్(Hyderabad Collector Anudeep) జీహెచ్‌ఎంసీ ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఖాదర్‌పై అసహనం వ్యక్తం చేశారు. చెత్తా చెదారం, మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. డెంగీ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో కలెక్టర్ బుధవారం రాంనగర్(Ramnagar)లోని ఎస్సార్టీ క్వార్టర్స్, కృష్ణానగర్‌లో పర్యటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఏపీ నుంచి మహారాష్ట్రకు.. వయా హైదరాబాద్
స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సార్టీ కాలనీ, కృష్ణానగర్ కాలనీని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త, మట్టికుప్పలను చూసి కలెక్టర్ కంగుతిన్నారు. వ్యర్థాలను వెంటనే తొలగించి యాంటీ లార్వా ఆపరేషన్(Anti-larvae operation) చేయాలని ఎంటమాలజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట కార్పొరేటర్ రవిచారి, బల్దియా అధికారులు ఉన్నారు.
..........................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................................
Hyderabad: రాచకొండ కమిషనరేట్‌లో స్థానచలనం..
-19 మంది సీఐలు, 10 మంది ఎస్సైల బదిలీ
హైదరాబాద్ సిటీ: రాచకొండ పోలీసు కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో బుధవారం భారీగా బదిలీలు జరిగాయి. 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు(Police Commissioner Sudhir Babu) ఉత్తర్వులు జారీ చేశారు. బది లీ అయిన వారు వెంటనే విధుల్లో చేరాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బదిలీ జరిగిన ఇన్‌స్పెక్టర్‌లలో పలు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు ఉన్నారు. ఎల్‌బీనగర్ ఎస్‌హెచ్‌వోగా వినోద్‌కుమార్, హయత్‌నగర్ ఎస్‌హెచ్‌వోగా పల్స నాగయ్య, చౌటుప్పల్ ఎస్‌హెచ్‌వోగా మన్మధకుమార్, చర్లపల్లి ఎస్‌హెచ్‌వోగా రవికుమార్ నియమితులయ్యారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News