Share News

Coal Mine: 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Jun 21 , 2024 | 01:12 PM

వెస్ట్ ఇన్ హోటల్‌లో10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం పాటను ప్రారంభించారు. ఈ వేలంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్డొన్నారు.

Coal Mine: 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్: వెస్ట్ ఇన్ హోటల్‌లో10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం పాటను ప్రారంభించారు. ఈ వేలంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్డొన్నారు. సింగరేణి సీఎండీ బలరాం, బిడ్డర్లు సైతం హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్‌లను కేంద్రం వేలానికి ఉంచింది.


వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్ మైన్‌ను పెట్టడం జరిగింది. శ్రావణపల్లి కోల్ మైన్‌లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గతంలో గుర్తించడం జరిగింది. సింగరేణి సంస్థకే నేరుగా శ్రవణపల్లి బ్లాక్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొంటోందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని శ్రావణ పల్లి బ్లాక్‌ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని భట్టి కోరడం జరిగింది.

Updated Date - Jun 21 , 2024 | 01:12 PM