Share News

BC Commission: మా కులాల పేర్లు మార్చండి

ABN , Publish Date - Dec 13 , 2024 | 06:21 AM

తమ కులాల పేర్లను మార్చాలని దొమ్మర, వంశరాజ్‌, తమ్మలి కుల సంఘాల ప్రతినిధులు బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

BC Commission: మా కులాల పేర్లు మార్చండి

  • బీసీ కమిషన్‌కు విజ్ఞప్తులు

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తమ కులాల పేర్లను మార్చాలని దొమ్మర, వంశరాజ్‌, తమ్మలి కుల సంఘాల ప్రతినిధులు బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కమిషన్‌ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో పలు సంఘాల నాయకులు వినతి పత్రాలు అందించారు. దొమ్మర కుల ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ కులం పేరును గడవంశీగా మార్చాలని కోరారు. తమ కులంలో ఉన్న పిచ్చగుంట్ల అనే పదాన్ని పూర్తిగా తొలగించాలని వంశరాజ్‌ కులంవారు విజ్ఞప్తి చేశారు. నాన్‌ బ్రాహ్మిణ్‌, శూద్ర అనే పదాలను తమ కులం పేరు నుంచి తొలగించాలని తమ్మలి కులం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పదాలతో తామ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

Updated Date - Dec 13 , 2024 | 06:21 AM