Congress: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 కేసీఆర్, ఏ2 కేటీఆర్.. కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణలు
ABN , Publish Date - Mar 27 , 2024 | 06:22 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఏ1, ఏ2 ముద్దాయిలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఏ1, ఏ2 ముద్దాయిలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేసేవారని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కి ప్రధాన కారణం వారిద్దరే అని.. వారికీ జైలు శిక్ష పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విమర్శించారు.
"తిండి లేకుండా బతకవచ్చు గానీ స్వేచ్ఛ లేకుండా బతకలేం. మానవ హక్కులను కాలారాస్తూ ట్యాపింగ్ చేయడం క్షమించరాని నేరం. భువనగిరి నుంచి నన్ను పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. నన్ను గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని రాజగోపాల్ అంటున్నారు. నాకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పా. స్వాతంత్ర్యానంతరం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారంతా నక్సలిజం వైపు మళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ, రెడ్లు రాజ్యమేలారు. తెలంగాణ వచ్చిన తర్వాత రావులు రాజ్యం ఏలారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరుగుతోంది" అని మధుయాష్కీ అన్నారు.