Share News

అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:54 AM

అంబేడ్కర్‌ను కించపరిచిన అమిత్‌షాను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు.

అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలి

  • అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ సభ్యుల నిరసన

  • షా వ్యాఖ్యలు... ప్రజలను గాయపర్చాయి: టీపీసీసీ చీఫ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ను కించపరిచిన అమిత్‌షాను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నంతోపాటు పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మహే్‌షగౌడ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌షా విషం కక్కడం.. దేశ ప్రజల గుండెను గాయపరిచిందన్నారు.


అమిత్‌షా వ్యాఖ్యలు మనువాద సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానిస్తే.. బీఆర్‌ఎస్‌ ఎందుకు మౌనంగా ఉందని మంత్రి పొన్నం నిలదీశారు. అమిత్‌షాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 20 , 2024 | 04:54 AM