Shankar journalist: తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర పోస్టులు
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:50 AM
తెలంగాణ తల్లి విగ్రహం మీద అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న జర్నలిస్టు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టు శంకర్‌పై చర్యలు తీసుకోండి
బేగంబజార్ పోలీసులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
అఫ్జల్‌గంజ్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహం మీద అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న జర్నలిస్టు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం బేగంబజార్ పోలీసులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు కైలాశ్ సజ్జన్, జంగా శ్రీనివాసరావు, హైదరాబాద్ కోఆర్డినేటర్ వీఎస్ వంశీలు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. స్త్రీలనే గౌరవం కూడా లేకుండా కేవలం రాజకీయ లబ్ధికోసం సీఎం రేవంత్ రెడ్డి సతీమణి, కుమార్తెల ఫొటోలను జత చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారన్నారు. జర్నలిస్టు శంకర్, యూట్యూబ్ చానల్ నిర్వాహకులు గతంలోనూ ఇలాంటి పోస్టులు చేశారని, శంకర్ జైలుకు కూడా వెళ్లాడని ఫిర్యాదులో గుర్తుచేశారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.