Malreddy Ranga Reddy: గవర్నర్ ప్రసంగం వినడానికి రాని కేసీఆర్ ప్రజలకు అవసరమా?..
ABN , First Publish Date - 2024-02-08T16:15:44+05:30 IST
గవర్నర్ ప్రసంగం వినడానికి రాని కేసీఆర్ ప్రజలకు అవసరమా అని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కదా అని ఆయన అన్నారు.
గవర్నర్ ప్రసంగం వినడానికి రాని కేసీఆర్ ప్రజలకు అవసరమా అని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కదా అని ఆయన అన్నారు. ఆస్తులను కూడబెట్టుకోవడం తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమి లేదని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ నేతలు అవాక్కులు చెవాక్కులు చేస్తున్నారని అన్నారు. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాట్లాడేది ఇదేనా అని రంగారెడ్డి ప్రశ్నించారు. తాము చెప్పిన ఆరు పథకాలను అమలు చేసి తీరుతామన్న రంగారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పిన మారడం లేదని, సీఎంపై విమర్శలు చేసే ముందు ఆలోచించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.