Chamala Kiran Kumar Reddy: అరెస్టుతో మైలేజీ భ్రమలో కేటీఆర్: చామల
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:16 AM
అరెస్టుతో మైలేజ్ వస్తుందన్న భ్రమలో కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.
అమిత్ షా క్షమాపణలు చెప్పాలి: మల్లు రవి
న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అరెస్టుతో మైలేజ్ వస్తుందన్న భ్రమలో కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకెళ్లి వచ్చారని, జైలుకెళ్లే విషయంలో కేసీఆర్ కుటుంబంలో పోటీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో మకర ద్వారం వద్ద ఆందోళన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.