Home » Chamala Kiran Kumar Reddy
హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
అరెస్టుతో మైలేజ్ వస్తుందన్న భ్రమలో కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పుష్ప 2 సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే.. పుష్ప 3 లెవల్లో మైలేజ్ వస్తుందనుకొంటున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మూడుసార్లు గెలిపించిన కొడంగల్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునేందుకు అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖలకు చెందిన 31అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారని ఎంపీ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఇప్పటివరకూ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) ఖండించారు.