Congress: రైల్వే సవరణ బిల్లు కాగితాల్లోనే..: ఎంపీ మల్లు రవి
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:23 AM
రైల్వే సవరణ బిల్లు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. రైల్వేలో పారదర్శకత కోసం స్వతంత్ర రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర విస్మరించిందన్నారు.
రైల్వే సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలం: అసదుద్దీన్
పద్మావతి ఎక్స్‌ప్రె్‌సను భువనగిరిలో ఆపాలి: చామల
న్యూఢిల్లీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైల్వే సవరణ బిల్లు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. రైల్వేలో పారదర్శకత కోసం స్వతంత్ర రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర విస్మరించిందన్నారు. బుధవారం లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుపై ఆయన మాట్లాడారు. ఈ బిల్లు రైల్వే బోర్డు అధికారాలు, దాని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, బిల్లులో ప్రభుత్వం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధంలేదన్నారు. తెలంగాణకు సంబంధించి బీదర్-బోధన్ వయా నారాయణ్‌ఖేడ్-ప్రీతంపూర్ రైల్వే లైన్ మ్యాప్ చేయాలని కోరారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రైల్వే సవరణ బిల్లు కేవలం కాగితాలకే పరిమితమైందని, రైల్వే సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మావతి ఎక్స్‌ప్రె్‌సను భువనగిరిలో, మచిలీపట్నం-బీదర్ రైలును భువనగిరి, ఆలేరు, జనగామ వద్ద ఆపాలని కోరారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి: అనిల్ కుమార్ యాదవ్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖఉక్కు కర్మాగారంలో 100ు పెట్టుబడులు ఉపసహరించుకోవాలని 2021లో నిర్ణయించినట్టు గుర్తు చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.