Share News

Suryapet: దేశం దృఢంగా ఉండాలి.. ప్రభుత్వాలు కాదు

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:24 AM

‘‘ప్రజాస్వామ్యంలో దేశం దృఽఢంగా ఉండాలి కానీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం దృఢంగా ఉంటే ప్రజలు బలహీనంగా ఉంటారు.. ప్రభుత్వం బలహీనంగా ఉంటే ప్రజలు దృఢంగా ఉంటారు..

Suryapet: దేశం దృఢంగా ఉండాలి.. ప్రభుత్వాలు కాదు

  • సంతృప్తి ఇచ్చిన 2024 ఎన్నికలు

  • ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

సూర్యాపేట, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యంలో దేశం దృఽఢంగా ఉండాలి కానీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం దృఢంగా ఉంటే ప్రజలు బలహీనంగా ఉంటారు.. ప్రభుత్వం బలహీనంగా ఉంటే ప్రజలు దృఢంగా ఉంటారు.. తమ కోరికలు చెప్పుకోగలుగుతారు.. సాధించుకోగలుగుతారు’’ అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. ఛత్తీ్‌సఘడ్‌లో 2015లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కొదుమగుండ్ల వివేక్‌ 9వ వర్ధంతిని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారకోపన్యాసంలో ‘2024 ఎన్నికల ఫలితాలు-ఓ అవగాహన’ అనే అంశంపై కె.శ్రీనివాస్‌ మాట్లాడారు.


పదేళ్ల కాలంలో బలహీనపడిన పౌర సమాజం, బలహీనపడిన ప్రజలు పుంజుకోవటానికి, బలపడేందుకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందనే 2024 ఎన్నికలను మనం అర్థం చేసుకోవాలని వివరించారు. కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలు మోదీని గెలవలేం... అన్న వాతావరణం నుంచి పర్వాలేదు మనం కట్టడి చేయగలిగాం అన్న సంతృప్తిని 2024 ఎన్నికలు తీసుకువచ్చాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకమని విరసం సభ్యుడే సీఎ్‌సఆర్‌ ప్రసాద్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంకా ఎన్‌కౌంటర్లు ఉంటున్నాయంటే అది ముమ్మాటికీ ప్రజాస్వామ్యం కాదన్నారు. కార్యక్రమంలో వివేక్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 04:24 AM