Share News

CPS Employees: 22న వరంగల్‌లో కాకతీ కదన భేరి

ABN , Publish Date - Dec 13 , 2024 | 06:28 AM

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్న ఏకీకృత ిపింఛను పథకం(యూపీఎ్‌స)ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో వరంగల్‌ కేంద్రంగా కాకతీ కదన భేరీ

CPS Employees: 22న వరంగల్‌లో కాకతీ కదన భేరి

  • ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరు కావాలి: స్థితప్రజ్ఞ

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్న ఏకీకృత ిపింఛను పథకం(యూపీఎ్‌స)ను వ్యతిరేకిస్తూ ఈనెల 22న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో వరంగల్‌ కేంద్రంగా కాకతీ కదన భేరీ నిర్వహిస్తున్నామని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులను మోసగించి, కార్పొరేట్ల కడుపు నింపేందుకే యూపీఎ్‌సను తీసుకొచ్చారని సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ పేర్కొన్నారు. ఉద్యోగి కుటుంబానికి సామాజిక భద్రత ఇవ్వని ఈ పథకాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన సమయం వచ్చిందని, వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Dec 13 , 2024 | 06:28 AM